ఆవు చ‌నిపోయింద‌ని రోడ్ల‌ పైకి జ‌నం

24 May, 2020 12:21 IST|Sakshi

ల‌క్నో: వివాహాల‌కు 50, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికి మాత్ర‌మే అనుమ‌తిస్తున్న‌ట్లు కేంద్రం స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చిన విష‌యం విదిత‌మే. కానీ ఇక్క‌డ మాత్రం ఓ గోవు అంత్య‌క్రియ‌ల‌కు వంద‌లాది జ‌నాలు త‌ర‌లి వచ్చి లాక్‌డౌన్ నిబంధ‌నల‌ను తుంగ‌లో తుక్కారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అలీఘ‌ర్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాలు.. అలీఘ‌ర్‌లోని మెమ్దీ గ్రామంలో దినేశ్ చంద్ర శ‌ర్మ అనే వ్య‌క్తికి చెందిన ఆవు గురువారం మ‌ర‌ణించింది. దానికి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వ‌హించాల‌ని గ్రామ‌స్థులు త‌లిచారు. అనుకున్న‌దే త‌డవుగా 150 - 200 మంది జ‌నాలు ఊరేగింపుగా బ‌య‌లు దేరారు. (5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు)

క‌నీసం మాస్కు ధ‌రించ‌కుండా, సామాజిక ఎడ‌బాటును సైతం ప‌ట్టించుకోకుండా వీధులు, రోడ్ల వెంబ‌డి తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు ఆవు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న‌ సుమారు 150 మందిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఇందులో వంద మంది మ‌హిళ‌లే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక ఈ ఘ‌ట‌న‌పై ఆవు య‌జ‌మాని శ‌ర్మ మాట్లాడుతూ.. "అంత్య‌క్రియ‌ల్లో  పాల్గొనేందుకు స్వ‌చ్ఛందంగా వ‌చ్చిన‌వారిని ఎలా అడ్డుకోగ‌ల‌ను? నేను ఆవును ఖ‌న‌నం కోసం తీసుకెళుతుంటే గ్రామ‌స్థులూ వ‌చ్చారు. ఇందులో త‌ప్పేముంది?  అయిన్ప‌టికీ దీన్ని త‌ప్పుగా ప‌రిగ‌ణించి మాపై చ‌ర్య‌లు తీసుకుంటానంటే అందుకు సిద్ధ‌మే"న‌ని బ‌దులిచ్చాడు. (ప్లాట్‌ఫామ్‌పై ఆహార పొట్లాలు.. ఎగబ‍డ్డ జనం!)

మరిన్ని వార్తలు