బెంగాల్ లో రోడ్డు ప్రమాదం.. 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు

15 Jul, 2016 13:53 IST|Sakshi

కోల్ కతాః పశ్చిమబెంగాల్ అలిపుర్దౌర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్నఓ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.  ప్రమాదంలో 17 మంది పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకొన్న స్కూల్ బస్ ప్రమాదంలో 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అలిపుర్దౌర్ జిల్లా మదరిహత్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో స్థానిక ప్రైవేట్ ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన  స్కూల్ బస్ ను.. వేగంగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్ళేందుకు బస్ లో బయల్దేరిన విద్యార్థుల్లో 17 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. గాయాలైనవారిని అలిపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడినుంచీ తప్పించుకొని  పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు