చిక్కిన చేప ధర చుక్కలనంటింది..

20 Nov, 2019 15:59 IST|Sakshi
మత్య్సకారులకు చిక్కిన చేప

కోల్‌కతా : ఎప్పటిలానే మంగళవారం కూడా మత్య్సకారులు వేటకు వెళ్లారు. గంగా నది ఒడ్డున చేపలు పడుతుండగా చేప వలకు చిక్కింది. ఆ చేపకు మంచి గిట్టుబాటు ధర పలకడంతో దాన్ని అమ్మిన జాలరి సంతోషంలో మునిగి తేలుతున్నాడు. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియాలో తరుణ్‌ బేరా అనే వ్యక్తి అతని మిత్రులతో కలిసి ఉదయం పూట చేపలు పట్టడానికి నదిలోకి వెళ్లారు. వారు వేసిన కొక్కానికి ఓ చేప చిక్కింది. దాన్ని బయటకు తీద్దామని ప్రయత్నించగా అది అంత సులువుగా పైకి రాలేదు. దీంతో స్నేహితుల సాయంతో వలను బయటకు లాగగా 18.5 కిలోల అరుదైన చేప చిక్కింది. బెట్కీఫిష్‌ అనే ఈ చేప కోసం స్థానికంగా వేలంపాట కూడా నిర్వహించాడు. ఎంతకాదన్నా రూ.13 నుంచి రూ.14 వేలు పలుకుతుందనుకున్నాడు. కానీ ఊహించినదానికన్నా ఒకింత తక్కువగా, సాధారణం కన్నా ఎక్కువగా రూ.12 వేల ధరకు దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. చేప గురించి తెలిసిన స్థానికులు దాన్ని చూడటానికి ఆసక్తి చూపించారు.

మరిన్ని వార్తలు