ఉత్తరఖండ్ లో కూలిన హెలికాఫ్టర్, 19 మంది మృతి

26 Jun, 2013 16:32 IST|Sakshi
ఉత్తరఖండ్ లో కూలిన హెలికాఫ్టర్, 19 మంది మృతి
ఉత్తరఖండ్ వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో విషాదం నెలకొంది. వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఏఐఎఫ్ హెలికాఫ్టర్ గౌరీకుండ్ వద్ద కుప్పకూలిన ఘటనలో 19 మంది మరణించారు. వాతావారణ సరిగా లేని కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్టు ప్రాథమిక సమాచారమని రుద్ర ప్రయాగ్ ఎస్పీ వారిందర్జీత్ సింగ్ తెలిపారు. హెలికాఫ్టర్ ప్రమాద ఘటన పరిస్థితిపై జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్ డీఎంఏ) వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్టు శశిధర్ రెడ్డి తెలిపారు.
 
అయితే ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 19 మంది ప్రాణాలతో బతికిపడే అవకాశాలేవని అధికారులు వెల్లడించారు. ఈ హెలికాఫ్టర్ లో ఎన్ డీఆర్ ఎఫ్, ఐటీబీపీ, ఐఏఎఫ్ అధికారులు ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. గౌచర్, గుప్తాక్షి, కేధారినాథ్ ప్రాంతాల్లో ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటుందని.. కేదారి నాథ్ నుంచి తిరిగి వెళుతుండగా ఉత్తర గౌరీ కుండ్ వద్ద ప్రమాదానికి గురైంది అని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. 
 
ఈస్టర్ ఎయిర్ కమాండ్ చెందిన హెలికాఫ్టర్ పశ్చిమ బెంగాల్ లోని బర్రాక్ పూర్ ఎయిర్ ఫోర్స్ కు చెందినదని.. రష్యానుంచి కొనుగోలు చేసిన ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్ ను గత సంవత్సరమే ఐఏఎఫ్ వినియోగిస్తోంది అని అధికారులు తెలిపారు. ఉత్తరఖండ్ లో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురికావడం ఈ వారంలో ఇది రెండవసారి. ఆదివారం నాడు రుద్ర ప్రయాగ జిల్లాలో గౌరీకుండ్ వద్ద హెలికాఫ్టర్ ప్రమాదానికి గురికాగా, పైలెట్ గాయాలతో బయటపడ్డాడు. 
 
మరిన్ని వార్తలు