జోయా ఖాన్‌కు కేంద్ర‌మంత్రి ప్ర‌శంస‌లు

4 Jul, 2020 20:27 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలోనే టెలీ మెడిసిన్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్ జోయా ఖాన్‌ను కేంద్ర న్యాయ‌శాఖ‌ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ప్ర‌శంసించారు. ప్ర‌స్తుతం వ‌డోద‌ర‌లో ప‌నిచేస్తున్న ఈమె ట్రాన్స్‌జెండ‌ర్ల అభివృద్ధికి  కృషి చేస్తోంద‌న్నారు. సాంకేతిక రంగంలోనూ  ట్రాన్‌జెండ‌ర్లు  మ‌రింత  అభివృద్ది చెందాల‌న్నాదే ఆమె ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు జోయా ఖాన్‌ను ప్ర‌శంసిస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. (భారతీయ టెక్కీలకు మోదీ సరికొత్త చాలెంజ్‌ )

దేశంలో ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు కూడా మిగ‌తావారితో స‌మానంగా అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టికే ప‌లు కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను (సీఎస్‌సీ) ఏర్పాటుచేసింది. దీనిలో భాగంగా గ్రామీణ‌, మారుమూల ప్రాంత‌వాసులకు సంక్షేమ ప‌థ‌కాలు, వైద్యం, ఆరోగ్యం, త‌దిత‌ర సేవ‌ల‌ను అందిస్తోంది.  ఈ నేప‌థ్యంలో దేశంలోనే తొలిసారి టెలీ మెడిసిన్ ఆప‌రేట‌ర్‌గా జోయా ఖాన్ నియ‌మితురాలైంది. గుజ‌రాత్‌లో వ‌డోద‌ర‌లోని కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సీఎస్‌సీ) లో విధులు నిర్వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్నందున ప్ర‌తీ ఒక్క‌రూ హాస్పిట‌ల్‌కి వెళ్ల‌కుండా రోగులు తమ సమీప కేంద్రం నుంచి వీడియో కాలింగ్ ద్వారా కన్సల్టేషన్ సౌకర్యాన్ని పొంద‌వ‌చ్చు. (కోవిడ్‌-19 టీకా: ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన )

మరిన్ని వార్తలు