‘రక్షణ’కు 2.74 లక్షల కోట్లు

2 Feb, 2017 04:38 IST|Sakshi
‘రక్షణ’కు 2.74 లక్షల కోట్లు
  • మొత్తం బడ్జెట్‌లో ఇది 12.77%
  • 2016–17తో పోల్చుకుంటే 6.2% పెరుగుదల
  • పింఛన్లకు అదనంగా రూ.85,737 కోట్లు
  • ఆధునికీకరణ కార్యక్రమాలకు పెద్దపీట
  • న్యూఢిల్లీ: రక్షణ రంగానికి 2017–18 బడ్జెట్‌లో రూ.2.74 లక్షల కోట్లు కేటాయిం చారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 12.77%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చు కుంటే ఇది 6.2% ఎక్కువ. త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఆధునీకరణ ప్రక్రియలో ముందుకుసాగు తున్న సమయంలో అందుకనుగుణంగానే వాటికి మూలధన కేటాయింపులో 10.05 పెరుగుదల చోటు చేసుకుంది. కొత్త పరికరాలు, ఆయుధాలు, ఎయిర్‌ క్రాప్ట్‌లు, యుద్ధనౌకలు తదితర సైనిక వాహనాల కొనుగోలు వంటి ఆధునీ కరణ కార్యక్రమాల నిమిత్తం మూడు దళాలకు కలిపి రూ.86,488 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం రూ.78,586 కోట్లుగా ఉంది. ప్రస్తుత సంవత్సరానికి సవరించిన మూలధన కేటాయింపు రూ.71,700 కోట్లని బడ్జెట్‌ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

    అంటే మిగతా రూ.6,886 కోట్ల బడ్జెట్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ ఖర్చు పెట్టలేకపోయిందా? లేక పొదుపు ఏమైనా చేశారా? అనేది తెలియడం లేదు. ఇలావుండగా రక్షణ రంగ పింఛన్ల నిమిత్తం రూ.85,737 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. సవరించిన అంచనాల తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల బడ్జెట్‌ రూ.85,624 కోట్లకు చేరింది. మూలధన కేటాయింపు రూ.86,488 కోట్లతో కలిపి రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్లు జైట్లీ బుధవారం లోక్‌ సభకు తెలిపారు. ఇందులో పింఛన్ల మొత్తం లేదన్నారు. రక్షణ సిబ్బంది సులభమైన ప్రయా ణానికి వీలుగా కేంద్రీకృత రక్షణ యాన విధా నాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ విధానంలో సైనికులు, అధికారులు తమ ప్రయాణ టిక్కె ట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని జైట్లీ తెలిపారు.

    రక్షణ రంగానికి చెందిన పింఛనుదారుల కోసం సమగ్ర వెబ్‌ ఆధారిత పింఛను పంపిణీ (ఇంటరాక్టివ్‌) విధానాన్ని నెలకొల్పనున్నట్లు కూడా జైట్లీ వెల్లడించారు. రక్షణ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. బడ్జెట్‌ను స్వాగతించిన రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ భమ్రే.. మూలధన కేటాయింపులో 9.3% పెరుగుదల చోటు చేసుకుం దంటూ ట్వీట్‌ చేశారు. మూలధన కేటాయింపు పెంపును రక్షణ పరిశ్రమ కూడా స్వాగ తించింది. స్వదేశీకరణపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తోందని శామ్‌టెల్‌ ఏవి యోనిక్స్‌ ఎమ్‌డీ పునీత్‌ కౌరా అన్నారు. రక్షణ రంగంలో మేక్‌ ఇన్‌ ఇండియాకు ఇది ఊతం ఇస్తుందన్నారు. ఆధునీకరణ అవసరాలకు ఈ పెంపు సరిపోదని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ అంకుర్‌ గుప్తా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు