ఆ బ్రదర్స్‌కు సెల్యూట్‌! పేదల ఆకలి తీర్చటానికి..

25 Apr, 2020 18:14 IST|Sakshi
అన్నదమ్ములు తాజమ్ముల్‌ పాశా, మజమ్మిల్‌ పాశాలు

బెంగళూరు : రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ ఇద్దరు అన్నదమ్ములు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దినసరి కూలీలకు నిత్యావసరాలను అందించటానికి సొంత స్థలాన్ని అమ్మారు. వివరాల్లోకి వెళితే.. కోలార్‌ జిల్లాకు చెందిన అన్నదమ్ములు తాజమ్ముల్‌ పాశా, మజమ్మిల్‌ పాశాలు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు సహాయపడాలనుకున్నారు. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దినసరి కూలీల కుటుంబాలను చూసి వారు చలించిపోయారు. వీలైనంత త్వరగా వారిని ఆదుకోవాలనుకున్నారు. ఇందుకోసం తమకు చెందిన స్థలాన్ని అమ్మి డబ్బు రూ. 25లక్షలు సమకూర్చారు. ( లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌.. పబ్‌ సీజ్‌ )

ఆ డబ్బుతో వారికి అవసరమైన నిత్యావసరాలను కొని అందించారు. అంతేకాకుండా అన్నార్థుల కోసం భోజన పొట్లాలు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘  మా చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు మేము కోలార్‌లోని మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్ఛేశాము. ఆ సమయంలో మా మతంతో సంబంధం లేకుండా.. హిందువులు, సిక్కులు, ముస్లింలు మాకు సహాయం చేశారు. కడుపేదరికంలో పెరిగాము. అన్ని వర్గాల ప్రజల అండదండల తోటే మేము బ్రతికామ’’ని తెలిపారు.

మరిన్ని వార్తలు