‘తల్లి జన్మనిస్తే.. సీఎం పునర్జన్మనిచ్చారు’

7 Jan, 2020 08:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 14 నెలలు పాకిస్తాన్‌ చెరలో గడిపిన ఆంధ్రా జాలర్లు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్‌ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘మాకు పునర్జన్మ లభించింది. పాకిస్తాన్ నుంచి బయటకు వస్తామో లేదోనని భయపడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో మేమంతా బయటికి రాగలిగాం. గుజరాత్‌ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి  పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించాం. దాంతో వారు మమ్మల్ని పట్టుకుని.. కరాచీలోని లాండీ జైల్లో ఉంచారు. మాతో అనేక పనులు చేయించుకున్నారు.
(చదవండి : స్వదేశానికి 20 మంది మత్స్యకారులు)

సరిగా తిండి కూడా పెట్టేవారు కాదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత మమ్మల్ని విడిపించేందుకు ప్రయత్నించారని తెలిసింది. తల్లి మాకు జన్మనిస్తే.. వైఎస్‌ జగన్‌ పునర్జన్మనిచ్చారు. మాకు సరైన ఉపాధి లేకనే చేపల వేటకు గుజరాత్‌ వెళ్లాం. మా ఉపాధికి అవసరమైన జెట్టీలను ప్రభుత్వం అందజేయాలని కోరుతున్నాం. 14 నెలల తర్వాత మా కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’అని అన్నారు. కాగా, ఢిల్లీ నుంచి 12 గంటలకు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా మత్స్యకారులు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లిన అనంతరం మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమక్షంలో వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు.
(చదవండి : సీఎం చొరవతో 20 మంది మత్స్యకారులకు విముక్తి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం..

మంచు దుప్పటిలో రాజధాని : పలు రైళ్లు జాప్యం

చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది

జేయూలోనూ జేఎన్‌యూ రగడ‌..

నేటి ముఖ్యాంశాలు..

అంతకంటే తక్కువ జరిమానా వేయొద్దు

13 నుంచి శబరిమల కేసులో విచారణ

లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు పెంపు

దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ

అల్లర్లకు కాంగ్రెస్, ఆప్‌లే కారణం

ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా

జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన

స్వదేశానికి 20 మంది మత్స్యకారులు

రైతు సృజనకు ప్రోత్సాహం

ప్రధానితో ‘మంచు’ కుటుంబం భేటీ

జనవరి 8 సమ్మెలో ఆరు బ్యాంకు సంఘాలు

ఆ సమ్మెలో 25 కోట్ల మంది

మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ వివాదాస్పద వీడియో: వైరల్‌

ఈనాటి ముఖ్యాంశాలు

హాజీపూర్‌ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే 

నేటి ప్రజా ఆందోళనల్లో విశేషాలెన్నో!

గెట్ రెడీ : ప్రశాంత్‌ కిషోర్‌

త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?

ఈ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే లక్ష ఆఫర్లు!

మోగిన ఢిల్లీ అసెం‍బ్లీ ఎన్నికల నగారా

జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్‌ సర్జికల్‌ స్రైక్స్‌..!

‘ముసుగు దుండగులను గుర్తిస్తా’

సకాలంలో ఓఎన్‌జీసీ కీలక ప్రాజెక్టు పూర్తి

జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్‌ ఠాక్రే ఫైర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల్లు అర్జున్‌ భావోద్వేగం

అలా బోర్‌ కొట్టింది

టాలీవుడ్‌ టు హాలీవుడ్‌

మెరిసే..మెరిసే...

మంచివాడు

స్టయిలిష్‌ ఫైటర్‌