రేప్ కేసులో ముగ్గురికి మరణశిక్ష

30 Jan, 2016 16:17 IST|Sakshi
రేప్ కేసులో ముగ్గురికి మరణశిక్ష

మరో ముగ్గురికి జీవిత ఖైదు

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కామ్‌దుని సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. శనివారం వారికి శిక్షలను ఖరారుచేసింది. ముగ్గురికి మరణ శిక్షను, మరో ముగ్గురికి జీవిత ఖైదును విధించింది.  

 

2013లో కాలేజి విద్యార్థిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, ఆపై హతమార్చిన ఘటన సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇటీవల ఇద్దరు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడం దుమారం రేగింది. వారిద్దరు పాలకపార్టీకి చెందినవారు కావడం వల్లే నిర్దోషులుగా బయటపడేలా పోలీసులు కేసు రూపొందించారని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్‌ బిమన్‌ బసు ఆరోపించారు.

కోలకతాలోని కామదుని కి కెందిన శిప్రాఘోష్ (20 )యువతిని ఎత్తుకెళ్లిన తొమ్మిది మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గొంతుకోసి, దారుణంగా  హింసించి హత్య చేశారు. బాధిత కుటుంబీకులను పరామర్శించిన ముఖ్యమంత్రి మమతా  బెనర్జీ  న్యాయ విచారణకు ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించిన బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయ విచారణకు డిమాండ్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు