2030 నాటికి చైనా తరువాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

20 Jan, 2019 01:55 IST|Sakshi
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఐబీబీఐ చైర్మన్‌ సాహూ

ఐబీసీ వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి

సిపీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఐబీబీఐ చైర్మన్‌ డాక్టర్‌ సాహూ

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్‌టీ, ఐబీసీ వల్ల 2030 నాటికి చైనా తరువాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనున్నదని ఇన్సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌. సాహూ అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేని కంపెనీ లను పునరుద్ధరించేందుకు పరిష్కార నిపుణు లు (ఆర్‌పీ) ప్రయత్నించాలని, తద్వారా ఆ కంపెనీని నమ్ముకుని ఉన్న ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేసినట్లు అవుతుందని సాహూ అన్నారు.రుణ పరిష్కార ప్రణాళికల తయారీ విషయంలోనూ ముందుచూపుతో వ్యవహరించాలని, రుణదాతల కమిటీ ముందు కేవలం ఒక రుణ పరిష్కార ప్రణాళి కనే ఉంచకుండా, దీర్ఘ కాలంగా ప్రయోజనం చేకూర్చే రుణ ప్రణాళికలను సైతం ఆ కమిటీ ముందు ఉంచాలని కోరారు.స్వయంగా రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించే వెసులు బాటును దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న కంపెనీకి సైతం కల్పించాలని, తద్వారా కంపెనీ పునరుద్ధరణకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.

సొసైటీ ఆఫ్‌ ఇన్సాల్వెన్సీ ప్రాక్టీషనర్స్‌ ఆఫ్‌ ఇండియా (సిపీ) ఆధ్వ ర్యంలో శనివారం నగరంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్‌ రప్టసీ కోడ్‌ (ఐబీసీ) అమలులో ఎదురవు తున్న ఇబ్బందులపై ఈ సమావేశం చర్చిం చింది. ఇందులో సిపీ అధ్యక్షుడు సుమంత్‌ బత్రా, సిపీ హైదరాబాద్‌ కన్వీనర్‌ వీవీఎస్‌ఎన్‌ రాజులతో పాటు పలువురు న్యాయవాదులు, కంపెనీ సెక్రటరీలు, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహు మాట్లాడుతూ, 2016లో వచ్చిన ఐబీసీ వల్ల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, ఈ కోడ్‌ వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. జీఎస్‌టీ, ఐబీసీ వల్ల 2030 నాటికి చైనా తరువాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనున్నదని తెలిపారు.

ఈ కోడ్‌ వల్ల దివాలా కంపెనీలకు, బ్యాంకు లకు మేలు జరుగుతుందని, దివాలా కంపెనీ ని ఇతరులు టేకోవర్‌ చేసేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే బ్యాంకులకు సైతం రుణాలు వసూలు అవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఐబీసీ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. దివాలాలో ఉన్న కంపెనీలను కొందరు బినామీలు చేజిక్కించుకుంటున్నా రని, దీనికి అడ్డుకట్టవేయాలని కోరారు. ఐబీసీలో పలు అంశాలపై స్పష్టత లోపించిం దని, వీటినీ అధిగమించినప్పుడే ఐబీసీ లక్ష్యం నెరవేరుతుందని వారు అభిప్రాయపడ్డారు. 

>
మరిన్ని వార్తలు