ఉత్తరప్రదేశ్లో అల్లర్లు, 21 మంది అరెస్టు

10 Oct, 2015 13:53 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్ మణిపూరిలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.   ఆవులను   చంపేస్తున్నారనే వదంతులు వ్యాపించడంతో  హింస చెలరేగింది. రాష్ట్ర రాజధాని లక్నోకి  ఆగ్రాకి  సమీపంలో  ఈ అల్లర్లు చెలరేగాయి. ఆవులను వధించారని, సమీప పొలాల్లో వాటి కళేబరాలు  పడివున్నాయనే  పుకార్లు చెలరేగడంతో  వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు పలుషాపులను ధ్వంసం చేశారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.   దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

అవు మాంసం అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో లల్లా, షాఫిక్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకుని చితకబాదారు.  గుంపునుంచి వారిని విడిదీసి స్టేషన్కు తరలిస్తుండగా  పోలీసు వాహనంపై దాడి చేసిన వారిని బయటకు లాగి పడేశారు. దీంతో అ దనపు బలగాలను రప్పించారు.  డీఐజీ లక్ష్మీ సింగ్ సంఘటనా  స్థలానికి చేరుకుని ప రిస్థితిని అదుపు చేశారు. 

తమ విచారణలో  ఇవన్నీ  పుకార్లని తేలాయని జిల్లా మాజిస్ట్రేట్ ప్రకటించారు.  ఈ కేసులో 21 మందిపై కేసు నమోదు  చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే  ఉందని జిల్లా  డీఎస్పీ ని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా  ఉత్తర ప్రదేశ్ దాద్రి లో ఆవు  మాంసం అమ్ముతున్నాడనే  అనుమానంతో  52 ఏళ్ల వృద్ధుణ్ని కొట్టి చంపిన ఘటన  కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు