ముఫ్పై ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కారు!

19 Jun, 2016 15:35 IST|Sakshi
ముఫ్పై ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కారు!

రాంచీ: కలిసి జీవిస్తూ దాదాపు ముఫ్పై ఏళ్ల తర్వాత 21 జంటలు పెళ్లి పీటలెక్కిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతిలో చోటుచేసుకుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నీలకంఠ సింగ్ ముండా తన నియోజకవర్గంలోని గిరిజన జాతుల్లో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలను గుర్తించి.. నిమిత్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో వారికి జీవిన విధానాల మీద అవగాహన కల్పించి పెళ్లిళ్లు చేసుకునేలా అంగీకరింపజేశారు.

‘ముండా’ గిరిజన తెగలకు చెందిన వీరు ఆర్థికంగా బాగా వెనుకబడిన వారు కావడంతో వారికి ఆర్థిక సాయం కూడా స్వచ్ఛంద సంస్థే చేసింది. నిమిత్ ఫౌండర్-డైరెక్టర్ నిఖిత సిన్హా మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత కోసం ముఖియా ఇండక్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా నాగ్ అనే వ్యక్తి పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా సాయం కోరారని తెలిపారు. ప్రపంచబ్యాంకు సహకారంతోనే గ్రామంలో పరిశుభ్రతకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు