రెజ్యూమ్ తో జాబ్ సంపాదించాడు!

19 Jun, 2016 20:33 IST|Sakshi
రెజ్యూమ్ తో జాబ్ సంపాదించాడు!

ఉద్యోగం కోసం రెజ్యూమ్ లు పట్టుకుని ఇంటర్వూల కోసం కంపెనీల చుట్టూ నిరుద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్న ఈ రోజుల్లో బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడు కేవలం రెజ్యూమ్ ని క్రియేటివ్ గా తయారుచేసి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఇంటర్వూ లేకుండానే జాబ్ సంపాదించాడు. జైన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంబీఏ పూర్తి చేసిన సుముఖ్ మెహతా(21) తన రెజ్యూమ్ తో బ్రిటిష్ మ్యాగజైన్ జీక్యూలో జాబ్ సంపాదించాడు.

దీనిపై మాట్లాడిన మెహతా నేటి పోటీప్రపంచంలో ప్రతి ఒక్క విషయాన్ని క్రియేటివ్ గా ఆలోచించడం చాలా కష్టమని అన్నారు. తాను క్రియేటివ్ గా ఆలోచించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. ఎంబీఏ చదివే రోజుల్లో ఎప్పుడూ బోర్ కొట్టించే రెజ్యూమ్ లతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చిందని, ఇన్ఫోగ్రాఫిక్స్ సాయంతో తయారు చేసిన వాటిని డిపార్ట్ మెంట్ డీన్ కు చూపించేవాడినని తెలిపారు. ఆయన బాగున్నాయని చెప్పి ఆ ఏడాది బీ-స్కూల్ విద్యార్థుల రెజ్యూమ్ లు అన్నీ తనతో చేయమన్నట్లు వివరించారు. కాగా, చివరిగా తనకోసం రెజ్యూమ్ తయారుచేసుకున్న'ఎక్స్-ఫ్యాక్టర్' రెజ్యూమ్ తో జీక్యూలో ఇంటర్వూ లేకుండా కొలువు సాధించాడు.

 

మరిన్ని వార్తలు