24 గంటల్లో.. 22,771 కరోనా కేసులు

4 Jul, 2020 10:23 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెండు మూడు రోజల నుంచి 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రికార్డు స్థాయిలో 22,771 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 6, 48,315కు చేరింది. కరోనాతో 24 గంటల్లో 442 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 18,655కు చేరుకుంది. దేశంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,94,226గా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,35,433 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇప్పటివరకు దేశంలో 95, 40,132 మందికి కరోనా వైరస్‌ నిర్దారణ పరీక్షలు జరిగినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు చూసుకుంటే.. అమెరికాలో 27, 93,435 కేసులు, బ్రెజిల్‌లో 15, 39,081 కేసులు, రష్యాలో 6,66,941 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అత్యధిక కరోనా కేసులే నమోదైన దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నా రానున్న రెండు రోజుల్లో కేసుల విషయంలో రష్యాను దాటి మూడో స్థానానికి చేరుకోనుంది.

మరిన్ని వార్తలు