ఈ ఏడాది కరువే?!

14 Sep, 2017 13:05 IST|Sakshi
ఈ ఏడాది కరువే?!
  • 235 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం
  • ఆయా జిల్లాల్లో కరువు పరిస్థితులు
  • వేసవిలో దారుణ పరిస్థితులు
  • తాజాగా వివరాలు వెల్లడించిన ఐఎండీ

  • సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ ఏడాది కూడా కరువు పరిస్థితులు తలెత్తబోతున్నాయి. రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా.. సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో అక్కడక్కడా కుంభవృష్టి కురిసినా.. ఎక్కడా సాధారణం కంటే ఎక్కువగా నమోదు కాలేదు.  దేశవ్యాప్తంగా ఈ ఏడాది 235 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొనబోతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు వల్ల సాధారణం కన్నా6.1 శాతం వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది.

    పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ వేసవి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 28 శాతం మించి వర్షపాతం నమోదుకాలేదని ఐఎండీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

    హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల్లో కదలికలు పెద్దగా లేవని ఐఎండీ ఉన్నతాధికారి శివానంద చెప్పారు.
     

మరిన్ని వార్తలు