15 సీట్లకు 248 మంది పోటీ 

20 Nov, 2019 08:07 IST|Sakshi

మొత్తం 353  నామినేషన్లు దాఖలు

 సాక్షి, బొమ్మనహళ్లి: ఉప సమరంలో అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. రాష్ట్రంలో 15 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు డిసెంబర్‌ 5వ తేదీన పోలింగ్‌ జరుగనుండగా మొత్తం 248 మంది అభ్యర్థులు 353 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారంతో నామినేషన్ల పర్వం సమాప్తమైంది. ఇందులో అత్యధికంగా బెంగళూరు నగరంలోని శివాజీనగరలో 36 నామినేషన్‌లు, హొసకోటె నుంచి 32 నామినేషన్‌లు,  హుణసూరు నుంచి 31 నామినేషన్లు వేశారు.  

ఏ నియోజకవర్గంలో ఎంతమంది?  
► బీజేపీ, కాంగ్రెస్‌ తదితర జాతీయ పార్టీల నుంచి 56 మంది అభ్యర్థులు 112 నామినేషన్లు సమర్పించారు.  
► రాష్ట్ర పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు 29 నామినేషన్‌లు ఇచ్చారు.  
► నమోదు కాని పార్టీల నుంచి 47 మంది అభ్యర్థులు 56 నామినేషన్‌లు వేశారు.  
► 128 మంది స్వతంత్రులు 156 నామినేషన్లు అందజేశారు.  
► శివాజీనగర నుంచి 28 మంది బరిలో ఉండగా హొసకోటె నుంచి 27 మంది పోటీలో ఉన్నారు. 
► హుణసూరు నుంచి 21 మంది, అథణిలో 16, కాగవాడలో 18 మంది, గోకాక్‌లో 13 మంది, యల్లాపురలో 11 మంది, హిరేకరూరులో 14 మంది, రాణి బెన్నూరులో 14 మంది, హొసపేటలో 18 మంది, ► చిక్కబళ్ళాపురలో 15 మంది, కృష్ణరాజపురంలో 16 మంది, యశవంతపురలో 12 మంది, మహాలక్ష్మి లేఔట్‌లో 17 మంది,  కెఆర్‌ పేట నుంచి 8 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.  

మరిన్ని వార్తలు