న్యూస్‌ ఛానల్‌లో పని చేస్తున్న 27 మందికి కరోనా

21 Apr, 2020 13:28 IST|Sakshi

చెన్నై : తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో విధులు నిర్వర్తిస్తున్న 27 మంది జర్నలిస్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. న్యూస్‌ ఛానల్‌లో రిపోర్టర్‌లతోపాటూ డెస్క్‌లో విధులు నిర్వర్తిస్తున్న సబ్‌ ఎడిటర్‌లకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. 24 ఏళ్ల జర్నలిస్ట్‌కి కరోనా పరీక్షల్లో తొలుత పాజిటివ్‌ రావడంతో సదరు న్యూస్‌ ఛానల్‌లో పని చేస్తున్న మొత్తం 94 మందికి కరోనా పరీక్షలు జరిపించారు. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 26 మందికి కరోనా సోకినట్టు తేలింది. (జ‌ర్న‌లిస్టుల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా: ఒక్క‌రోజే 53 మందికి..)

తొలుత కరోనా వ్యాధి సోకిన 24 ఏళ్ల జర్నలిస్ట్‌ తండ్రి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి సూచనల మేరకు కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేపించుకోగా, జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో న్యూస్‌ ఛానల్‌లో పని చేస్తున్న మిగతా వారికి పరీక్షలు జరిపించగా 26 మందికి కరోనా పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయి. దీంతో వెంట‌నే వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇక ముంబైలో కూడా రిపోర్ట‌ర్లు, కెమెరామెన్‌లు క‌లుపుకుని మొత్తంగా 53 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు