అమ్మ కేబినెట్‌లో 28 మంది

22 May, 2016 01:05 IST|Sakshi
అమ్మ కేబినెట్‌లో 28 మంది

గవర్నర్‌తో జయలలిత భేటీ

 సాక్షి, చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జయలలితను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కే రోశయ్య ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సాధించిన జయ శనివారం గవర్నర్‌ను కలిశారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్నీ, 28 మంది మంత్రుల పేర్ల జాబితాను సమర్పించారు. ఈ జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనెల 23న జయ సీఎంగా, 28 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు.

 రాష్ట్ర పార్టీ హోదా కోల్పోనున్న డీఎండీకే: గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడింది. తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన డీఎండీకే ఒక్కసీటును కూడా గెలుపొందలేక చతికిలపడింది. కేవలం 2.4 శాతం ఓట్లనే పొందింది.

మరిన్ని వార్తలు