కశ్మీర్లో ఉగ్రదాడి

5 May, 2020 04:57 IST|Sakshi

ముగ్గురు జవాన్లు మృతి

శ్రీనగర్‌: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్‌పాయింట్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్‌ హజీమ్‌ భట్‌ అనే 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ‘వాంగమ్‌– ఖాజియాబాద్‌ వద్దనున్న చెక్‌పాయింట వద్ద సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు’ అని అధికారులు సోమవారం వెల్లడించారు. ఘటనాప్రాంతానికి అదనపు దళాలను తరలించామని, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని వివరించారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా