డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ముగ్గురు మృతి

10 May, 2019 11:27 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్‌ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది.

డ్రైనేజీని శుభ్రం చేసేందుకు 8 మంది మురుగును శుద్ధి చేసే ప్లాంట్‌లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్‌లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు