‘రక్షణ’కు 3.18 లక్షల కోట్లు 

6 Jul, 2019 04:27 IST|Sakshi

మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపులే కొనసాగింపు

ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ రూ. 3,18,931 కోట్లు 

గత ఏడాది రక్షణ బడ్జెట్‌ రూ. 2.98 లక్షల కోట్లు 

పెన్షన్‌ కేటాయింపులు రూ. 1,12,079 కోట్లు 

పెన్షన్లను కలిపితే మొత్తం బడ్జెట్‌ రూ. 4.31 లక్షల కోట్లు 

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో 2019– 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. 1962 చైనా యుద్ధం తర్వాత అతి తక్కువగా దేశ జీడీపీలో దాదాపు 1.6 శాతం మేర రక్షణ శాఖకు కేటాయింపులు చేశారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేటాయింపుల్లో పెట్టుబడి మూలధన వ్యయం కోసం రూ. 1,08,248 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ పరికరాలు, కొనుగోలు చేయను న్నారు. అలాగే రెవెన్యూ వ్యయాన్ని రూ. 2,10,682 కోట్లుగా ఖరారు చేశారు. ఈ నిధులను వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణ నిమిత్తం వినియోగిస్తారు. అలాగే ఈసారి రూ. 2.95 లక్షల కోట్లు బడ్జెట్‌ అంచనాలను చూపించగా.. 7.93 శాతం వృద్ధితో రూ. 3,18,931 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కార్యాలయం తెలిపింది. అలాగే మన దేశంలో తయారు కాని రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేందుకు కస్టమ్స్‌ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రూ. 1,12,079 కోట్ల పెన్షన్‌ నిధులను విడిగా కేటాయించారు. ఈ పెన్షన్‌ నిధులను, మొత్తం శాఖ బడ్జెట్‌ను కలిపి చూస్తే రక్షణ శాఖ బడ్జెట్‌ రూ. 4.31 లక్షల కోట్లు అవుతుంది. అయితే  బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయించిన నిధుల తో రక్షణ నిపుణులు నిరాశ వ్యక్తం చేశారు.

హోం శాఖకు 1.19 లక్షల కోట్లు  
మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు పెద్దపీట
హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ. మౌలిక వసతులను మెరుగుపర్చడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన రక్షణ కల్పించడంపై కేంద్రం ఎక్కువగా దృష్టిపెట్టింది. 2018–19 బడ్జెట్‌కు సంబంధించి సవరించిన అంచనా (రూ. 1,13,167 కోట్లు) కంటే 5.17 శాతం ఎక్కువగా ఈ సారి హోం శాఖకు నిధులు అందనున్నాయి. దేశ రాజధానిలో చట్టాన్ని అమలు చేసే ఢిల్లీ పోలీసు విభాగానికి రూ. 7,496.91 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–చైనా సహా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 2,129 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌లో తెలిపింది. నక్సల్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనటంతోపాటు అవసరమైనప్పుడు ఇతర విధులను కూడా నిర్వర్తించే సీఆర్‌పీఎఫ్‌కు తాజా బడ్జెట్‌లో రూ. 23,963.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కాపలాకాసే సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)కు రూ. 19,650.74 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. మొత్తంగా అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్‌) కలిపి మొత్తంగా రూ. 71,713.9 కోట్లను కేంద్రం కేటాయించింది. 2018–19 బడ్జెట్‌లో ఈ మొత్తం రూ. 67,779.75 కోట్లు మాత్రమే. దేశం లోపల నిఘా కోసం పనిచేసే నిఘా విభాగం (ఐబీ)కి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2,384.1 కోట్లు ఇచ్చారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబీకులకు రక్షణ కల్పించే ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ)కు రూ. 535.45 కోట్లను కేటాయించారు.
 
మౌలిక వసతులకు 4 వేల కోట్లు 
బ్యారక్‌లు, నివాస గృహాల నిర్మాణం, ఆధునిక వాహనాలు, ఆయుధాల కొనుగోలు తదితరాల వంటి మౌలిక వసతుల కోసం రూ. 4,757 కోట్లను కేంద్రం ఈ బడ్జెట్‌లో కేటాయించింది. పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 3,462 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి రూ. 825 కోట్లు, జమ్మూ కశ్మీర్‌లో వలసదారులు, ఇంకా వలస వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చిన వారికి పునరావాసం కోసం రూ. 842 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ కోసం రూ. 953 కోట్లను బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్‌ షా

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై ఆరా తీయండి

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

కులాంతర వివాహమా? మొబైల్‌ వాడుతున్నారా?

వరద బీభత్సం.. 50 మంది మృతి..!

ప్రధాని లక్ష్యంగా దాడికి కుట్ర!

టీనేజ్‌ అమ్మాయి మొబైల్‌ వాడితే జరిమానా..!

అనారోగ్యం అతడి పాలిట వరమైంది

ప్రాంతీయ భాషల్లో మళ్లీ ‘పోస్ట్‌మెన్‌’ పరీక్ష

కోడలికి కొత్త జీవితం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!