మేలో అంతరిక్షంలోకి 3 ఉపగ్రహాలు

20 Apr, 2017 02:56 IST|Sakshi

టీనగర్‌(చెన్నై): దక్షిణాసియా దేశాలకు చెందిన ఉపగ్రహం సహా మూడింటిని మే నెలలో అంతరిక్షంలోకి ప్రయోగించనున్నట్లు ఇస్రో డైరెక్టర్‌ పీవీ.వెంకటకృష్ణన్‌ వెల్లడించారు. బుధవారం చెన్నై ఐఐటీ 58వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్‌ఎల్‌వీ ఎంకే–2 రాకెట్‌ ద్వారా దక్షిణాసియా దేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సంబంధిం చిన అన్ని పనులు ముగిశాయన్నారు. జీఎస్‌ఎల్‌ వీ ఎంకే–2 మే మొదటి వారం లో, జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 చివరి వారంలో శ్రీహరి కోట కేంద్రం నుంచి ప్రయో గించనున్నట్లు తెలిపారు. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడంలో ఇబ్బందులు ఏర్పడవని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు