ఆకలి.. చలి : అరుదైన జంతుజాతి బలి

13 May, 2019 10:54 IST|Sakshi

ఒక పక్క  కండరాలను నలిపేసే గడ్డకట్టించే చలి.. మరోవైపు  పేగులు మెలిపెట్టే  ఆకలి అరుదైన మూగ జీవుల పాలిట అశని పాతంలా తగిలింది.  దీంతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం పర్వత  ప్రాంతాల్లో అరుదైన జంతు జాలి బలైపోయింది.  కనీసం 300 అరుదైన హిమాలయన్ జడల బర్రెలు  ప్రాణాలొదిలాయి. తాజాగా మంచు కరుగుతుండటంతో  వీటి కళేబరాలు  బయపడుతున్నాయి.

ప్రభుత్వ అధికారి రాజ్ యాదవ్ అందించిన సమాచారం గత ఏడాది  డిసెంబర్‌నుంచి సుదీర్ఘ కాలంగా కురుస్తు మంచు ఈ విషాదానికి దారితీసింది. ఉత్తర సిక్కింలోని ముగుతాంగ్, యమ్తంగ్ పర్వతాలను సందర్శించే స్థానిక నిర్వాహకులు,  పశువైద్యులు బృందం  వీటి కళేబరాలను  శుక్రవారం కనుగొన్నారని ఉత్తర సిక్కిం జిల్లా మేజిస్ట్రేట్  రాజ్ యాదవ్ చెప్పారు. ముగాతాంగ్ , యమ్‌తంగ్‌ లోయ ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వాకరా ఆహారం జార విడవడానికి అధికారులు పలుసార్లు ప్రయత్నించినా, వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా విఫలమయ్యారని యాదవ్ చెప్పారు.  వీపరీతంగా కురుస్తున్న  మంచు  కారణంగా వాటికి ఆహారాన్ని సరఫరా చేయాల్సింది స్థానికులను కోరినట్టు తెలిపారు.  

500 జడల బర్రెలు చనిపోయినట్టుగా స్థానికుల ద్వారా తెలుస్తోందని, ఈ సంఖ్యని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని యాదవ్‌ తెలిపారు. మరికొన్నింటికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నట్టు  వెల్లడించారు.  అలాగే పశు సంరక్షణ శాఖ వైద్య బృందం ముకుతాంగ్‌కు  ఇప్పటికే   చేరుకున్నట్టు తెలిపారు.  మరోవైపు చనిపోయిన  పశువులను  పాతిపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు