32 విమానాల దారి మళ్లింపు..!

18 May, 2019 09:23 IST|Sakshi

న్యూఢిల్లీ : వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే 32 విమానాలను శనివారం దారి మళ్లించారు. వర్షం, తీవ్రమైన గాలుల నేపథ్యంలో లక్నో, జైపూర్‌, అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుల్లో విమానాలను ల్యాండింగ్‌ చేయించామని అధికారులు తెలిపారు. పది ఫ్లైట్లను సాయంత్రం 4 నుంచి 5 మధ్య, మరో 22 విమానాలను రాత్రి 9 నుంచి 10 మద్య దారి మళ్లించామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు