ఢిల్లీలో 34,000 మంది శిశువుల మృతి

18 Mar, 2015 17:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో ప్రపంచస్థాయి ఆరోగ్య వసతులున్నా, ఏయిమ్స్‌లాంటి వైద్య విజ్ఞాన సంస్థలున్నా పురుటి బిడ్డలను పరిరక్షించలేక పోవడం శోచనీయం. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న 19 ఆస్పత్రుల్లో 3,4000 మంది మరణించినట్టు సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువులు మృత్యువుబారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సఫ్దారాజంగ్ ఆస్పత్రిలోనే 10, 396 మంది శిశువులు మరణించగా, చిల్డ్రన్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో దాదాపు ఏడువేల మంది శిశువులు మరణించారు. ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లలే ఎక్కువ మంది మరణిస్తున్నారు.
 
 డయేరియా, న్యూమేనియా, ఇతర అంటువ్యాధుల కారణంగా పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాధ్యర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయనేది సుస్పష్టం. అయితే తొమ్మిది నెలలు పూర్తికాకముందే పుట్టడం, పుట్టిన శిశువులు తక్కువ బరువుండడం, తల్లి కడుపులో ఉండగానే అంటురోగాల బారిన పడడం వల్లనే ఈ మరణాలు సంభవించాయని ఇటు వైద్యులు, అధికారులు సమర్థించుకుంటున్నారు.దేశంలో ఏటా 2.60 కోట్ల శిశువులు జన్మిస్తుండగా, వారిలో ఐదేళ్లలోపు 18.30 మంది పిల్లలు చనిపోతున్నారు. వైద్య విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేటి యుగంలో ఆనారోగ్యంకాటు నుంచి పిల్లలను రక్షించుకోక పోవడం మన ఆస్పత్రుల పాపమేనని చెప్పవచ్చు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు