ప్రాంతీయ చిచ్చు.. స్థానికేతరులపై దాడులు

8 Oct, 2018 11:37 IST|Sakshi

ఇతర రాష్ట్రాల వ్యక్తులపై దాడులు చేస్తున్న గుజరాతీయులు

తమ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు

 మైనర్‌ బాలికపై అత్యాచారం జరిపారని ఆందోళన

గాంధీనగర్‌ : అల్లర్లకు గుజరాత్‌ మరోసారి వేదికైంది. ఇతర రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చి గుజరాత్‌లో ఉపాధి పొందుతున్న వారిపై స్థానికుల దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి చాలా మంది ఉపాధి కోసం వచ్చి అహ్మదాబాద్‌, సూరత్‌, గాంధీనగర్‌ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిపై గతవారం రోజులుగా గుజరాతీయులు మూకుమ్మడిగా దాడికి దిగుతున్నారు. వారి వేధింపులను తట్టుకోలేక చాలా మంది సొంత గ్రామాలకు తిరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడిన 350మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి.. ప్రమాదకరమైన ఏడు జిల్లాల్లో సిబ్బందిని మోహరించారు.

దాడులకు అసలు కారణం..
గుజరాత్‌లో ఇటీవల ఓ మైనర్‌ బాలిక అత్యాచారానికి గురైంది. బిహార్‌, యూపీ నుంచి వచ్చిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ మహిళలపై అత్యాచారాలకు దిగుతున్న వారు ఇక్కడ ఉండడానికి వీళ్లేదని.. వారందరిని ఇక్కడి నుంచి తరిమికొట్టాలని కొంతమంది గుజరాతీ యువకులు నిర్ణయించుకున్నారు. దీని కోసం సోషల్‌ మీడియాతో ప్రేత్యేక గ్రూప్‌ను తయారుచేసుకుని దాడులకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించారు.

దీంతో గతవారం రోజులకు స్థానికేతరులపై దాడులకు దిగుతూ.. తమ రాష్ట్రం విడిచి వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో తమపై గుజరాతీయులు దాడులకు పాల్పడుతున్నారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 42  ఫిర్యాదు అందాయని.. దాడులకు పాల్పడిన 350 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వారు పండగలకు సొంత గ్రామాల వెళ్తున్నారని, తాము ఎవ్వరిపై దాడులకు పాల్పడలేదంటూ అరెస్ట్‌ అయిన వారు చెపుతున్నారు.

మరిన్ని వార్తలు