కోర్టులకు సవాలుగా మారిన పెండింగ్‌ కేసులు!

29 Jun, 2020 09:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 37 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు, జిల్లా, తాలుకా కోర్టుల్లో ఉన్న 3.7 కోట్ల కేసుల్లో 10 శాతం (37 లక్షలు) కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నేషనల్‌ జ్యుడీయల్‌ డేటా గ్రిడ్‌(ఎన్‌జేడీజీ) వెల్లడించింది. జాతీయ న్యాయస్థానాల పనితీరును ఎన్‌జేడీజీ పర్యవేక్షిస్తుంది. దీని ప్రకారం.. జిల్లా, తాలూకా కోర్టుల్లో 28 లక్షల కేసులు, హైకోర్టులలో 9,20,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 6,60,000 కేసులు 20 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండగా.. ఇక 3 దశాబ్దాలకు పైగా 1,31,000 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎన్‌జేడీజీ నివేదికలో పేర్కొంది. కేసులు పేరుకుపోవడంపై జూన్‌ 15న సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా క్రిమినల్ అప్పీల్స్, బెయిల్ పిటిషన్లు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్నట్టు సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. (రెండు నెలలకు సరిపడా గ్యాస్‌ సిలిండర్లు నిల్వ చేసుకోండి)

వెంటనే పరిష్కారమయ్యే క్రిమినల్‌ అప్పీళ్లను సుప్రీం కోర్టు గుర్తించి సకాలంలో వాటిని విచారించేందుకు కోర్టులకు అనుమతులు ఇచ్చింది. ఒకవేళ ఈ అప్పీళ్లను పరిమిత సమయంలోపు విచారణ చేపట్టకపోతే అప్పీల్ హక్కు దారులు, జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులు (బెయిల్ నిరాకరించబడినవారు) వారిపై అత్యధిక ప్రభావం చూపుతుంది. పెండింగ్‌లో ఉన్న అలాంటి క్రిమినల్ అప్పీళ్లను పరిష్కరించడానికి సమగ్ర ప్రణాళికను సమర్పించాల్పిందిగా అలహాబాద్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పాట్నా, ఒరిస్సా, రాజస్థాన్, బొంబాయి హైకోర్టులను సుప్రీం కోర్టు కోరింది.

మరిన్ని వార్తలు