12 లక్షలకు చేరువగా..

23 Jul, 2020 02:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బుధవారం కొత్తగా 37,724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కు చేరుకుంది. మరో వైపు గత 24 గంటల్లో 28,432 మంది కోలుకున్నారు. ఒకే రోజులో ఇంత మంది కోలుకోవడం ఇప్పటి వరకూ అత్యధికం కావడం గమనార్హం. అంతేగాక గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కోవిడ్‌ కారణంగా 648 మంది మరణించారని, దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 28,732కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 4,11,133 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 7,53,049 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారని చెప్పింది.

రికార్డు స్థాయిలో రికవరీలు..
దేశంలో బుధవారం 28,478 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన అత్యంత ఎక్కువ రికవరీ కేసులు ఇదే కావడం గమనార్హం. అంతేగాక రికవరీ రేటు  63.13 శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.41కి పడిపోయింది. మరణాల రేటు తగ్గుతూ వస్తోందని, రికవరీ రేటు పెరుగుతోందని తెలిపింది. జూన్‌ 17న మరణాల రేటు 3.36 శాతంగా ఉండగా అది  బుధవారానికి 2.41కి పడిపోయింది.

మరిన్ని వార్తలు