నాలుగు మొండాలు స్వాధీనం..

19 Sep, 2016 15:42 IST|Sakshi
నాలుగు మొండాలు స్వాధీనం..

బెగూసరాయ్ః తలలేని నాలుగు మొండాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెగుసరాయ్ జిల్లా సన్హా  రైల్వే క్రాసింగ్ దగ్గరలోని ఓ మురిగి కాలువ వద్ద  మృత దేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

బీహార్ బెగుసరాయ్ జిల్లాలో తలలేని మొండాలు కనిపించడం కలకలం సృష్టించింది. కాలువవద్ద పశుగ్రాసం కోసేందుకు వెళ్ళిన ఓ మహిళకు ఆ ప్రాంతంలో పడుకోబెట్టి ఉన్న తల లేని మృత దేహాలు కనిపించడంతో ఆమె వెంటనే తమకు సమాచారం అందించినట్లు సాహెబ్పూర్ కమల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. మృతదేహాల్లో ఒక మహిళ, ఇద్దరు మైనర్ బాలికలు, ఓ బాలుడు ఉండగా.. బాడీలను పోస్ట్ మార్టమ్ కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు. పోలీసులు త్వరలో మృతులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు