బాంబులు పేలి ఆరుగురి మృతి

3 May, 2016 02:24 IST|Sakshi

బెంగాల్లో ఘటన

 మాల్దా: పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో బాంబుల్ని నిర్వీర్యం చేస్తుండగా అవి పేలి సోమవారం ఇద్దరు సీఐడీ అధికారులు మరణించారు. అంతకుముందు అక్కడే బాంబు పేలి నలుగురు మృతిచెందారు. మే 5న చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్లు కలకలం రేపాయి.

మాల్దా జిల్లా జౌన్‌పూర్ గ్రామంలో గైసు షేక్ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాంబులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఒకరు సంఘటన స్థలంలో, ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. ఆ గ్రామంలో మరో రెండు బాంబుల్ని కనుగొనడంతో సీఐడీకి చెందిన బాంబు నిర్వీర్వ బృందానికి సమాచారమిచ్చారు. వాటిని నిర్వీరం చేస్తుండగా పేలడంతో విశుద్దానంద మిశ్రా, సుబ్రతా చౌదరి అనే ఇద్దరు సీఐడీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు