కశ్మీర్‌లో ‘స్నైపర్‌’ కలకలం

29 Oct, 2018 05:52 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌ వ్యాలీలో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు స్నైపర్‌ (దొంగచాటుగా) దాడులకు దిగడం భద్రతా దళాలను కలవరపరుస్తోంది. గత నెల నుంచి ఇప్పటివరకు ముగ్గురు భద్రతా సిబ్బంది స్నైపర్‌ దాడుల్లో మృతిచెందారు. దీంతో ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని అవ లంబించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిఘా అధికారుల సమాచారం మేరకు జైషే ఉగ్రవాదులు రెండు వేర్వేరు గ్రూపులను నిర్వహిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. ఈ రెండు గ్రూపుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరు చొప్పున స్నైపర్లు కశ్మీర్‌ లోయలో సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం స్థానికుల సహాయంతో పుల్వామాలో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు. లోయలో స్నైపర్‌ దాడులు చేసేందుకు వీరంతా పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ద్వారా శిక్షణ పొం దారని, వీరి వద్ద అఫ్గానిస్తాన్‌లో యూఎస్‌ భద్రతా దళాలు ఉపయోగించే ఎమ్‌–4 కార్బైన్‌ ఆయుధాలున్నట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు