అక్కడ మానవ పుర్రెలు.. ప్రజల్లో భయం

30 May, 2020 08:30 IST|Sakshi

భువనేశ్వర్‌: నదీ తీరాల్లో మానవ పుర్రెలు తారస పడ్డాయి. ఈ సంఘటన పట్ల స్థానికులో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాల్లో తాంత్రిక శక్తుల సాధన, ప్రయోగంతో మానవ పుర్రెలు వినియోగిస్తారు. ఈ ప్రాంతంలో పుర్రెలు తారసపడడం ఈ కార్యకలాపాలకు తార్కాణంగా పరిగణించి సాధారణ ప్రజానీకం ఆందోళన చెందుతోంది. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ పోలీసు స్టేషన్‌ పరిధి కృష్ణనందపుర గ్రామంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణనందపుర ఔట్‌పోస్టు పోలీసు అధికారి అనిరుద్ధ నాయక్‌ సందిగ్ధ ప్రాంతాల్ని సందర్శించి రెండు ప్రాంతాల్లో 4 పుర్రెల్ని కనుగొన్నారు. ఈ నేపథ్యంలో  విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా