మళ్లీ బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు

25 Jun, 2020 17:10 IST|Sakshi

మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న ఎన్పీపీ అధ్యక్షుడు

షిల్లాంగ్: మణిపూర్ నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి రాజీనామా చేసిన నలుగురు మంత్రులు మళ్లీ తిరిగి ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్పీపీ ప్రెసిడెంట్, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా గురువారం తెలిపారు. బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వారు చెప్పినట్లు వెల్లడించారు.(మరో జవాన్‌ వీరమరణం)

రాజ్యసభ ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వం నుంచి తప్పుకున్న మంత్రులు తిరిగి మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. (కరోనాకు భారతీయ మహిళలే ఎక్కువగా బలి!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు