లొంగిపోయిన 40 మంది మావోయిస్టులు

29 May, 2016 09:20 IST|Sakshi

రాయ్ పూర్: మావోయిస్టు ఉద్యమంలో ఒక పెద్ద కుదుపు. ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ కు చెందిన 40 మంది మావోయిస్టులు  ఒకేసారి లొంగిపోయారు. వీరిలో రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కూడా ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. 40 మంది నక్సల్స్ బస్తర్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. దర్భా డివిజన్ కు చెందిన 19 మంది, కాంగెర్ వాలీ కమిటీకి చెందిన ఇద్దరు, దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన 19 మంది ఉన్నారు.

దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన సుబ్లి కష్యప్ తలపై రూ.8 లక్షల రివార్డు ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్లు,  ఆయధాలను దొంగిలించారనే ఆరోపణ వీరిపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వీరికి రూ.10 వేల చొప్పున బస్తర్ జిల్లా కలెక్టర్ ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు