ఢిల్లీని ముంచింది అదే..

17 Nov, 2017 11:34 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, కాలుష్యానికి గల్ఫ్‌ తీరంలో రేగిన అలజడికి సంబంధం ఉందని తాజా అథ్యయనం తేల్చింది. గల్ఫ్‌ తుపాన్‌ తాకిడితో వేల కిలోమీటర్లు దాటి దుమ్ము,ధూళి ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలోకి చొచ్చుకువచ్చాయని, ఫలితంగా నవంబర్‌ 7 నుంచి ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయిలకు చేరిందని ప్రభుత్వ వాయు నాణ్యతా పరిశోధన సంస్థ సఫర్‌ విశ్లేషణ పేర్కొంది. ఢిల్లీని కప్పిన పొగమంచులో 40 శాతం కాలుష్య కారకాల్లో గల్ఫ్‌ నుంచి వచ్చిన డస్ట్‌ ఉండగా, పంజాబ్‌, హర్యానాల్లో తగులబెట్టిన పంట వ్యర్థాలు 25 శాతం కారణమని, ఇక 35 శాతం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో ఉత్పత్తయ్యే కాలుష్యం పరిస్థితి తీవ్రతకు దారితీసిందని సఫర్‌ విశ్లేషించింది.

ఉధృతంగా వీచిన గాలుల ప్రభావంతో గల్ఫ్‌ నుంచి వ్యర్థ రేణువులు రాజధానికి రాగా, పొరుగు రాష్ర్టాల్లో పంట వ్యర్ధాలు తగులబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీ వాసులకు కాలుష్యం చుక్కలు చూపిందని పేర్కొంది.నవంబర్‌ 6 నుంచి నవంబర్‌ 10 వరకూ ఇవన్నీకాలుష్య ముప్పు పరాకాష్టకు చేరేందుకు దోహదపడ్డాయని సఫర్‌ చీఫ్‌ గుఫ్రాన్‌ బేగ్‌ స్పష్టం చేశారు.

నవంబర్‌ 7 సాయంత్రం 5 గంటలకు వాయు నాణ్యత ఎన్నడూ లేని విధంగా ఆందోళనకర స్ధాయిలకు పడిపోయిందని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన చర్యలతో కాలుష్య స్ధాయిలు 15 శాతం తగ్గాయని ఈ విశ్లేషణ తెలిపింది.

>
మరిన్ని వార్తలు