కరోనా: పెరుగుతున్న ‘తబ్లిగి’ కేసులు

2 Apr, 2020 20:15 IST|Sakshi
లవ్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ: దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 400 మంది వరకు నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన వివరాలు ఆధారంగా ఈ విషయం వెల్లడైందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తబ్లిగి జమాత్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారా తమిళనాడులో అత్యధికంగా 264 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 67, తెలంగాణలో 33, ఢిల్లీలో 47, జమ్మూకశ్మీర్‌లో 22,  అసోంలో 16, రాజస్థాన్‌లో 11, అండమాన్‌నికోబార్‌లో 9, పుదుచ్చేరిలో 2 కేసులు తబ్లిగి జమాత్‌కు వెళ్లొచ్చిన వారి కారణంగా వ్యాపించినట్టు గుర్తించామన్నారు. మరికొన్ని కరోనా కేసులు వెలుగులోకి వచ్చే అవకాశముందన్నారు.

నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడటమే కాకుండా మరణాలు కూడా నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో మరణాలు సంభవించాయి. కాగా, తబ్లిగి జమాత్‌ నిర్వాహకుడు మౌలానా సాద్‌, ఇతరులపై  ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, 960 మంది విదేశీయులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి వీసాలు రద్దు చేశారు. (కరోనా భయం: వరుస ఆత్మహత్యలు)

మరిన్ని వార్తలు