లక్షద్వీప్‌ సముద్రంలో భూకంపం

12 Oct, 2016 09:06 IST|Sakshi
లక్షద్వీప్‌ సముద్రంలో భూకంపం

లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. తెల్లవారుజామున 4.01 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చిందని, దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతున ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది.

ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం గానీ, ప్రాణనష్టం గానీ సంభవించినట్లు ఇంతవరకు సమాచారం లేదు. 2006 సంవత్సరంలో సంభవించిన సునామీ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ విధ్వంసం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం సునామీ భయం ఏమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వార్తలు