వరదల్లో 5,748 మంది గల్లంతు: బహుగుణ

15 Jul, 2013 17:26 IST|Sakshi
విజయ్ బహుగుణ

చార్ ధామ్ వరదల్లో గల్లంతయిన వారు జూలై 15లోగా ఆచూకీ దొరక్కపోతే వారిని మృతి చెందిన వారిగా ప్రకటిస్తామన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ మాట మార్చారు. ఆచూకీ దొరకని వారిని మృతి చెందిన వారిగా ప్రకటించేందుకు ఆయన నిరాకరించారు. జూన్ 16న సంభవించిన ఆకస్మిక వరదల్లో 5,748 మంది గల్లంతయ్యారని ఆయన తెలిపారు.  

కేంద్ర ప్రణాళిక, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి బహుగుణ విలేకరులతో మాట్లాడారు. ఆచూకీ తెలియని వారు తిరిగి వస్తారన్న ఆశాభావంతో ఉన్నామని అన్నారు. జూలై 15లోగా ఆచూకీ తెలియని వారిని చనిపోయిన వారి కిందే పరిగణించి, వారి కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామని అంతకుముందు బహుగుణ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గల్లంతయిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని బహుగుణ తెలిపారు. వరదల్లో మృతి చెందిన, గల్లంతయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రేపటి నుంచి పరిహారం అందించనున్నట్టు చెప్పారు. ఒకవేళ గల్లంతయిన వారు తిరిగొస్తే పరిహారం అందుకున్న కుటుంబం దాన్ని తిరిగిచ్చేయాలని కోరారు.  కేదార్ నాథ్ లో వ్యర్థాలను తొలగించే పనులకు ప్రతికూల వాతావరణం ఆటకం కలిగిస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు