పండుగ రోజున అపశృతి

3 Apr, 2017 20:29 IST|Sakshi

► చెరువులో స్నానానికెళ్లి ఐదుగురు చిన్నారుల మృతి

బిహార్‌: బీహార్‌లోని  విషాదం చోటుచేసుకుంది.అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడ్డారు. గ్రామ శివారున ఉన్న కైమూర్‌ జిల్లాలో బుద్ధా గ్రామంలోనా చెరువులో స్నానానికెళ్లి ఐదుగురు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. గ్రామంలో సోమవారం పండుగ కావడంతో చెరువు వద్ద గ్రామస్తులంతా గుమిగూడారు. ప్రార్థనలు చేసిన అనంతరం స్నానాలు చేశారు. పెద్ద వాళ్లు అంతా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లిపోయారు.

ఆ తర్వాత చిన్నారులు స్నానం చేయడానికి చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. చనిపోయిన వాళ్లంతా 5 నుంచి 12 మధ్య వయసు వారని స్థానిక పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు బిహార్‌ ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించింది.

మరిన్ని వార్తలు