ఈసారి మరో ఆలోచనతో అక్షత్‌

30 Jul, 2016 11:07 IST|Sakshi
ఈసారి మరో ఆలోచనతో అక్షత్‌

న్యూఢిల్లీ: ఆడ్‌ ఈవెన్‌ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు అక్షత్‌ మిట్టల్‌ గుర్తున్నాడా? దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్య నివారణ కోసం కేజ్రీవాల్‌ సర్కారు ప్రవేశపెట్టిన సరి–బేసి విధానం వల్ల వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు వెబ్‌సైట్‌ను 13 ఏళ్ల వయసులోనే ప్రారంభించి అందరి మన్ననలు పొందిన అక్షత్‌ మరో అద్భుతమైన యాప్‌ను రూపొందించాడు.


ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న అక్షత్‌ మిట్టల్‌... ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందుకు ‘చేంజ్‌ మై ఇండియా డాట్‌ ఆర్గ్‌’ పేరున కొత్త వెంచర్‌ను ఆవిష్కరించాడు. ‘ఓరాహీ’ సలహా బోర్డుతో కలిసి రూపొందించిన ఈ యాప్‌ ద్వారా..  దైనందిన జీవితంలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు అక్షత్‌ కొత్త యాప్‌.. చేంజ్‌ మై ఇండియా డాట్‌ ఆర్గ్‌... పనిచేయనుంది. సమాజంలో మార్పు కోరుకునేవారు, అందుకు సాయం అందించే ఆసక్తి ఉన్నవారితో కలిసి.. దాదాపు పది లక్షల మంది సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు