50 మంది వలస కూలీలకు కరోనా

20 May, 2020 11:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : దేశంలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరకుంటున్న వలస కూలీలకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 50 మంది వలస కూలీలకు కరోనా సోకినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా వారం రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు చేరుకున్నట్టుగా జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ నిరంజన్‌ తెలిపారు. (చదవండి : కరోనా.. ఒక్క రోజే 5,600 కేసులు)

ప్రస్తుతం వీరితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు. సరైన సమయంలో వీరికి కరోనా సోకినట్టు గుర్తించడం వల్ల.. సామూహిక వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు.  50 మంది వలసకూలీలకు కరోనా సోకడంతో.. బస్తీ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 104కి చేరింది. ఇందుకు సంబంధించి యూపీ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమిత్‌మోహన్‌ ప్రసాద్‌.. రాష్ట్రానికి వస్తున్న వలసకూలీలకు జిల్లాల్లోని షెల్టర్‌ హోమ్స్‌లో స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. కరోనా లక్షణాలు లేనివారిని 21 రోజులు హోం క్వారంటైన్‌ చేస్తామని.. లక్షణాలు ఉన్నవారికి తదుపరి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు