నవోదయ స్కూళ్లలో 5వేల సీట్ల పెంపు

8 Jan, 2019 04:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో సీట్లను కేంద్రం మరో 5 వేలు పెంచింది. తాజా పెంపుతో నవోదయ విద్యాలయాల్లో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య 46,600 నుంచి 51వేలకు పెరిగింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. నవోదయ పాఠశాలల్లో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల తరహా ఉచిత విద్యనందిస్తోంది. దేశంలో ఆరో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించే విద్యా సంస్థలు నవోదయ విద్యాలయాలే. 2001లో దేశ వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరుకాగా 2019లో ప్రవేశ పరీక్షకు నమోదు చేయించుకున్న విద్యార్థుల సంఖ్య 31 లక్షలకు చేరుకుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవడేకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు