అక్రమ గనుల లెసైన్సుల రద్దు

16 Sep, 2013 00:48 IST|Sakshi
అక్రమ గనుల లెసైన్సుల రద్దు

సాక్షి, బళ్లారి (కర్ణాటక): సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన 51 గనుల లెసైన్సులను కర్ణాటక ప్రభుత్వం రద్దు చే సింది. అలా రద్దయిన గనుల కంపెనీల యజమానుల్లో కాంగ్రెస్ నేతలే అధికంగా ఉన్నారు. బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్, జిల్లాకు చెందిన మంత్రి సంతోష్‌లాడ్, హొస్పేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, మాజీ కేపీసీసీ అధ్యక్షుడు అల్లం వీరభద్రప్పలకు చెందిన మైనింగ్ కంపెనీల లెసైన్సులు రద్దయ్యాయి. అయితే, మంత్రి పదవుల నుంచి కూడా వారిని తొలగిస్తారా?  లేదా? అన్న చర్చ సాగుతోంది.
 
 బీజేపీ, ఇతర పార్టీల వారే అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని అప్పటి కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే ఎన్నికల్లో అక్రమ గనుల యజమానులకు టికెట్లను కేటాయించి, గెలిచిన తర్వాత వారిని మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కింది. ఈ నేపథ్యంలో అక్రమ గనుల తవ్వకాల్లో కాంగ్రెస్ వారే అధికంగా ఉండటంతో వారి లెసైన్సులు రద్దు చేస్తారా లేదా అన్నదానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును పాటించాల్సి వచ్చింది.
 

మరిన్ని వార్తలు