కొత్త రాజ్యసభ ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులు

30 Jun, 2016 01:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన 57 మంది ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులు కాగా.. ఇందులో 13 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎంపీల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలను  వెల్లడించింది. దీని ప్రకారం.. ఎక్కువ ఆస్తులున్న ఎంపీల్లో రూ. 252 కోట్లతో ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ మొదటి స్థానంలో ఉండగా.. కపిల్ సిబల్ (కాంగ్రెస్-రూ.212 కోట్లు), సతీశ్ చంద్ర మిశ్రా (బీఎస్పీ-రూ.193 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బీజేపీ ఎంపీలు అనిల్ మాధవ్ దవే (రూ.60 లక్షల), రామ్ కుమార్ (రూ.86 లక్షలు) చివరి స్థానంలో ఉన్నారు. ఎంపీలందరి ఆస్తుల సగటు రూ. 35.84 కోట్లుగా తేలిందని ఏడీఆర్ పేర్కొంది. అటు, యూపీ నుంచి నలుగురు, బిహార్ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌నుంచి ఒక్కో ఎంపీపై క్రిమినల్ కేసులున్నాయి.

మరిన్ని వార్తలు