పసిగుడ్డుపై మానవ మృగం హత్యాచారం

21 Apr, 2018 09:48 IST|Sakshi

సాక్షి,ఇండోర్‌: మైనర్‌ బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులపై  జరుగుతున్న క్రూర అకృత్యాలు హృదయాలను  పిండేస్తున్నాయి. దేశంలో ఏదో ఒక మూల చోటుచేసుకుంటున్న అఘాయిత్యాల తీరు, హత్యలు  ప్రతీ  మనిషినీ ఆందోళనలో పడేవేస్తోంది.  రోజుకో హత్యాచార ఘటన కలవరం పుట్టిస్తోంది.  గత కొన్నిరోజులుగా కథువా, ఉన్నావ్‌, సూరత్‌, చత్తీస్‌ఘడ్‌..ఇలా  ఈ జాబితా పెరుగుతూ పోవడం నిజంగా అవమానకరం.  తాజాగా  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో  ఓ పసికందు కామాంధుడి అకృత్యానికి మౌన సాక్ష్యంగా మిగిలింది.  

6నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. శుక్రవారం మధ్యాహ్నం ఒక సెల్లార్‌లో రక‍్తపు మడుగులో పడివున్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని సునీల్‌  భీల్(‌21) గా గుర్తించారు.  పాప శరీరంలోని ప్రయివేటు భాగాల్లోనూ, తలపైన గాయాలను గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. బాధితురాలు తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారనీ, నిందితుడు కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసు అధికారి మిశ్రా  వెల్లడించారు.  త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామనీ, దర్యాప్తు అనంతరం  పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.  దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై స్వర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు