ఆ ఆరు రాష్ట్రాలు హైరిస్క్

29 May, 2020 08:09 IST|Sakshi

అక్కడి నుంచి వచ్చే వారికి పరీక్షలు చేశాకే ఏపీలోకి  అనుమతి 

మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతించనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. 
మార్గదర్శకాలు ఇవీ.. 
పైన పేర్కొన్న ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు నెగిటివ్‌ అని తేలాక 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్‌ అని తేలితే కోవిడ్‌ ఆస్పత్రులకు వెళ్లాలి. 
హైరిస్క్‌ ప్రాంతాల నుంచి వచ్చిన అసింప్టమాటిక్‌ (లక్షణాలు కనిపించని) వారిని నిర్ధారణ చేశాక ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉంచాలి. 
అంతర్జాతీయ ప్రయాణికులకు సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అసింప్టమాటిక్‌ వారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. 
60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చు. 
విమానాలు, రైళ్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు. 
క్వారంటైన్‌లో ఉన్న వారిని ప్రతిరోజూ పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యవేక్షిస్తారు.   

చదవండి: పరిశ్రమాంధ్ర

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా