సీఏఏకు వ్యతిరేకంగా 620కి.మీ. మానవహారం

27 Jan, 2020 08:31 IST|Sakshi

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కేరళలోని తిరువనంతపురంలో ఆందోళనకారులు 620 కి.మీ పొడవున భారీ మానవహారాన్ని నిర్వహించారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో ఉత్తర కేరళలోని కసరగడ్‌ నుంచి కళియక్కవిలై వరకు సుమారు 620 కి.మీ వరకు మానవహారాన్ని చేపట్టారు.  మానవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సహా సుమారు 60 లక్షలమంది ప్రజలు పాల్గొని ఉంటారని వామపక్ష కూటమి (ఎల్టీఎఫ్‌) అంచనా.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా