ఆ 64,943మంది చిన్నారులేమైనట్లు?

28 Feb, 2016 16:40 IST|Sakshi
ఆ 64,943మంది చిన్నారులేమైనట్లు?

న్యూఢిల్లీ: ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ధనం.. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్య.. ఆ సమస్య తగ్గడమో.. కనిపించకుండా పోవడమో పోవాల్సిందిపోయే ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. దేశంలో కనిపించకుండా పోతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతునే ఉంది. వారిలో కొందరిని మాత్రమే గుర్తిస్తున్న పోలీసులు మిగితా వారి విషయంలో చేతులెత్తేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.రెండున్నర కోట్లు ఖర్చుచేస్తున్నా తప్పిపోతున్న చిన్నారులను గుర్తించడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారు. నాలుగేళ్ల కిందట దేశంలో తప్పిపోయిన చిన్నారుల సంఖ్య 60 వేలు ఉండగా అది కాస్త తగ్గాల్సిందిపోయి పెరిగింది.

తాజాగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో కనిపించకుండా పోయిన చిన్నారుల సంఖ్య ప్రస్తుతానికి 64,943కు చేరింది.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం జనవరి 2012 నుంచి ఫిబ్రవరి 2016 మధ్య కాలంలో మొత్తం 1,94,213 మంది చిన్నారులు అదృశ్యం కాగా వారిలో 1,29,270మందిని పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగితా వారి వివరాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. దీంతో గతంలో ఉన్న సంఖ్యకన్నా మరో నాలుగున్నర వేలు పెరిగింది. కనిపించకుండా పోయినవారంతా కూడా కిడ్నాప్, ఎత్తుకుపోవడం, మనుషుల అక్రమ రవాణా, దొంగ దత్తత విధానాలు, ఇంటిలో నుంచి పారిపోవడం కారణాల వల్లే అదృశ్యం అయ్యారు.

మరిన్ని వార్తలు