ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా

2 May, 2020 10:20 IST|Sakshi

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బస్తి జిల్లాలో ఏడుగురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబై నుంచి స్వస్థలాలకు వచ్చిన కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బస్తి జిల్లా మెజిస్ట్రేట్‌ అషుతోష్‌ నిరంజన్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను యూపీ ప్రభుత్వం బస్సులో స్వస్థలాలకు తీసుకువచ్చింది. మహారాష్ట్ర నుంచి ఝాన్సీ మీదుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో కార్మికులు బస్తీ జిల్లాకి చేరుకున్నారు. వీరికి పరీక్ష నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిని  క్వారంటైన్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.(లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇక అంతే: డబ్ల్యూహెచ్‌ఓ)

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 1,008 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం మహారాష్ట్రాలో కరోనా బాధితుల సంఖ్య 11,506కి చేరుకుంది.(జిల్లాకు చేరుకున్న 11,621 మంది కూలీలు)

మరిన్ని వార్తలు