భారత్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు!

5 Nov, 2019 10:52 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన ఏడుగురు ఉగ్రవాదులు

న్యూఢిల్లీ : భారత్‌లోకి ఏడుగురు ఉగ్రవాదలు చోరబడినట్టుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమచారం అందింది. నేపాల్‌ గుండా వారు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు తెలిసింది. మరి కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు అయోధ్య రామజన్మభూమిపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. యూపీలో విధ్వంసం జరిపేందుకే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ప్రస్తుతం అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో దాక్కుని ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో యూపీ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తంగా చేశాయి.

భారత్‌లోకి ప్రవేశించిన ఏడుగురిలో ఐదుగురు ఉగ్రవాదులను నిఘా వర్గాలు గుర్తించాయి. మహమ్మద్‌ యాకుబ్‌, అబూ హమ్జా, మహమ్మద్‌ షాబాజ్‌, నిసార్‌ అహ్మద్‌, మహమ్మద్‌ ఖౌమి చౌదరిలు నిఘా వర్గాలు గుర్తించిన వారిలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పాక్‌కు చెందినవారే. అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే యూపీలోని పలు ప్రాంతాల్లో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు